ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్హత తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.

స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్(ఎస్సెస్సీ) కంబైన్డ్ హ‌య్యర్ సెకండ‌రీ లెవ‌ల్ ఎగ్జామినేష‌న్(సీహెచ్ఎస్ఎల్‌) -2017 ప్రక‌ట‌న వెలువ‌డింది. వివిధ విభాగాల్లో మొత్తం 3259 ఖాళీలు ఉన్నాయి. ఇంట‌ర్మీడియ‌ట్ లేదా స‌మాన విద్యార్హత ఉన్నవాళ్లు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. మార్చిలో టైర్‌-1 ప‌రీక్షలు నిర్వహిస్తారు. టైర్‌-2 ప‌రీక్ష జులైలో ఉంటుంది. ఎంపిక విధానం: మూడు ద‌శ‌ల్లో ప‌రీక్షలు ఉంటాయి. టైర్‌-1: క‌ంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష, టైర్‌-2: డిస్క్రిప్టివ్ ప‌రీక్ష, టైర్‌-3: టైపింగ్ టెస్టు (స్కిల్‌టెస్టు) టైర్‌-1 కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష ఇలా:
మొత్తం 200 మార్కుల‌కు ఆబ్జెక్టివ్ ప‌రీక్షను నిర్వహిస్తారు. వంద ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. ప‌రీక్ష వ్యవ‌ధి 75 నిమిషాలు. జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ నుంచి 25, ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్‌) 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమెటిక్ స్కిల్‌) 25, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు చొప్పున వ‌స్తాయి. ప్రతి సెక్షన్‌కు యాభై మార్కులు. ప్రతి త‌ప్పు స‌మాధానానికీ అర మార్కు చొప్పున త‌గ్గిస్తారు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. తుది ఎంపిక‌లో పేప‌ర్‌-1 మార్కుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.టైర్‌-2 డిస్క్రిప్టివ్ పేప‌ర్‌:
ఈ ప్రశ్నప‌త్రం వంద మార్కుల‌కు ఉంటుంది. ఈ ప‌రీక్షను ఆఫ్‌లైన్‌లో పేప‌ర్‌పైనే నిర్వహిస్తారు. ప‌రీక్ష ద్వారా ప్రభుత్వ ఉద్యోగానికి అవ‌స‌ర‌మైన రాత నైపుణ్యాల‌ను ప‌రిశీలిస్తారు. సుమారు 200-250 ప‌దాల్లో వ్యాసం, 150-200 ప‌దాల్లో ఉత్తరం లేదా ద‌ర‌ఖాస్తు రాయమంటారు. స‌మాదానాన్ని ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమాల్లో రాయాలి. 33 శాతం మార్కులు సాధించిన‌వారిని అర్హులుగా ప‌రిగ‌ణిస్తారు. తుది ఎంపిక‌లో పేప‌ర్‌-2 మార్కుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.టైర్‌-3 స్కిల్ టెస్టు లేదా టైప్ టెస్టు
డేటా ఎంట్రీ పోస్టుల‌కు గంట‌ల‌కు 8000 కీ డిప్రెష‌న్స్ కంప్యూట‌ర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెష‌న్స్ ఉన్న ఆంగ్ల వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవ‌ధిలో కంప్యూట‌ర్‌లో టైప్ చేయ‌మంటారు. పోస్టల్ అసిస్టెంట్‌/ సార్టింగ్ అసిస్టెంట్‌, ఎల్‌డీసీ పోస్టుల‌కు టైప్ ప‌రీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం ఇంగ్లిష్ టైప్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 ప‌దాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 ప‌దాలు టైప్ చేయాలి. టైర్‌-3 అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరుఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేది: 18.12.2017
టైర్‌-1 ప‌రీక్ష తేది: 04.03.2018-26.03.2018
టైర్‌-2 డిస్క్రిప్టివ్ ప‌రీక్ష తేది: 08.07.2018
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: గుంటూరు, క‌ర్నూలు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం, హైద‌రాబాద్‌, నిజామాబాద్‌, వ‌రంగ‌ల్‌. (అభ్యర్థులు వారి ప్రాధాన్యాన్ని అనుస‌రించి 3 ప‌రీక్ష కేంద్రాలు ఎంచుకోవ‌చ్చు. ఎంచుకున్న కేంద్రాల్లో ఒక‌చోట ప‌రీక్ష రాసే అవ‌కాశాన్ని క‌ల్పిస్తారు)
వెబ్‌సైట్‌: www.ssconline.nic.in

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*


Share