“మోహన్ బాబు, విష్ణు, శ్రియ” నటించిన”గాయత్రి” మూవీ రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

డైలాగ్ కింగ్ మోహన్‌బాబు తనదైన శైలిలో మాటల తూటలు, నటన రుచి చూపించి చాలా రోజులైంది. టాలీవుడ్‌ తెరపై మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడానికి మోహన్‌బాబు చేసిన ప్రయత్నం గాయత్రి. టైటిల్‌తోనే మంచి రెస్పాన్స్ సంపాదించుకొన్న మంచు ఫ్యామిలీ.. టీజర్లు, ట్రైలర్లతో అలరించింది. దాంతో గాయత్రి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు, మంచు విష్ణు, శ్రీయ సరన్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకొందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

Story: ఒక చిన్న పాపకి వచ్చినకష్టం చుట్టూ తిరిగే సీరియస్ సెంటిమెంట్ వున్న కథ గాయత్రీ . తల్లి ప్రేమకు దూరమై విలన్లకు టార్గెట్ గా మారిన ఆ పాపను , అదే విలన్ బ్యాచ్ లో వన్ అఫ్ ది మెయిన్ హెడ్ అయిన మోహన్ బాబు , వారితో తిరగపడి , ఆ పాపను తన తల్లి దెగ్గరికి ఎలా చేర్చాడన్నది కథకి మూలాంశం .

Review: మోహన్ బాబు హీరోగా, విలన్‌గా రెండు విభిన్న పాత్రల్లో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. మోహన్ బాబు నటి విశ్వరూపాన్ని చూస్తారు ఈ సినిమాలో . కొన్ని ఏమోషనల్ సీన్స్ లో అయితే మోహన్ బాబు కన్నీళ్లు పెట్టిస్తాడు . రామాయణంలోనే రాముడికి రావణాసురుడికి గొడవ.. మాహాభారతంలో పాండవులకి, కౌరవులకి మాత్రమే గొడవ.. వాళ్లు వాళ్లు కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోతే బాగుండేది. కాని వాళ్ల మూలంగా జరిగిన ఆ యుద్ధంలో లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పయితే, ఇక్కడ నేను చేసింది కూడా తప్పే’.. అక్కడ వాళ్లు దేవుళ్లైతే.. నేనూ దేవుడ్నే.. అర్థం చేసుకుంటారో.. అపార్థం చేసుకుంటారో చాయిస్ ఈజ్ యువర్స్ మోహన్ బాబు చెప్పిన డైలాగ్స్‌తో కూడిన సీన్లకు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి .ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే మంచు విష్ణు, శ్రియ సన్నివేశాలు సినిమాకు హైలైట్. థమన్ సంగీతం కూడా బాగుంది.

Plus Points:

హీరో, విల్లన్ గా రెండు పాత్రల్లో మోహన్ బాబు నటన
ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే విష్ణు, శ్రియ మధ్య సన్నివేశాలు
సెంటిమెంట్
ఎమోషన్స్
డైలాగ్స్

Minus Points:

స్క్రీన్ ప్లే
ఎడిటింగ్

Final Verdict:

మాస్ మాత్రమే కాదు క్లాస్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా “గాయత్రీ”

AP2TG Rating: 3 / 5

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*


Share